Tenth question paper
-
‘దొంగలా వచ్చి చంద్రబాబు సభలో ప్రకటన’
-
‘దొంగలా వచ్చి చంద్రబాబు సభలో ప్రకటన’
అమరావతి : పదో తరగత ప్రశ్నపత్రాల లీకేజిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ చేత విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 6.50 లక్షల విద్యార్ధుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ లీకేజిపై చర్చ జరపడానికి అవకాశం ఇవ్వడం లేదని, మంగళవారం దీనిపై సభలో పట్టుబడితే గురువారం ప్రకటన చేస్తామని చెప్పి విపక్షం లేని సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దొంగలా వచ్చి దీనిపై ప్రకటన చేయడంతోపాటు విలువైన బిల్లులను కూడా పాస్ చేయించుకున్నారని తెలిపారు. ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రకంగానూ, మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆ వార్త ఒక్క సాక్షి పత్రికలోనే ప్రచురితం కావడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షి దినపత్రికలే కారణమంటూ ఆరోపణలు చేయడం టీడీపీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. ఈ ప్రశ్న పత్రాల లీకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం బినామీగా మంత్రి నారాయణ వ్యవహరిస్తుండటంతో ఆయనేం అక్రమాలకు పాల్పడినా చర్యలు ఉండటం లేవని ఆరోపించారు. -
ప్రశ్నాపత్రం లీకుపై మంత్రి సీరియస్
- విచారణకు ఆదేశం విజయవాడ: నెల్లూరు జిల్లాలో పదోతరగతి సైన్స్-1 పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్త హల్చల్ చేస్తోంది. సామన్య శాస్త్రం-1 ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. -
మడకశిరలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్
పరీక్ష ప్రారంభమైన అరగంటకే వాట్సాప్‌లో ప్రత్యక్షం సాక్షి, అమరావతి, నెట్వర్క్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పేపర్–1 ఎగ్జామ్ జరిగింది. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం సృష్టించింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. అరగంటకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఏ, బీ సెంటర్లను ఏర్పాటు చేశారు. బీ సెంటర్లో మడకశిరలోని మాతా ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని, ప్రభుత్వ బాలికల హైస్కూల్‌కు చెందిన మరో విద్యార్థిని పరీక్ష రాస్తున్నారు. వీరిద్దరూ స్నేహితులు. వీరిలో ఒకరికి స్లిప్పులు అందించేందుకు ఈశ్వర్, భాస్కర్, గణేశ్, పవన్‌కుమార్ అనే వ్యక్తులు అక్కడికి వచ్చారు. కిటికీ పక్కనే ఉన్న విద్యార్థిని వద్దకు వెళ్లి ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకున్నారు. సెల్ఫోన్లో ఫొటో తీసుకుని, ప్రశ్నపత్రాన్ని తిరిగిచ్చేశారు. అనంతరం అది వాట్సాప్‌లో హల్చల్ చేయడంతో పెద్ద దుమారం రేగింది. మడకశిర ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి పేపర్ లీక్‌పై విచారణకు ఆదేశించారు. ప్రశ్నపత్రంపై రాసిన హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇన్విజిలేటర్ బి.కిశోర్, ఇద్దరు విద్యార్థినులు, మరికొంత మంది బయటి వ్యక్తులను విచారించారు. లీక్ ఘటనకు ఈశ్వర్, భాస్కర్, గణేశ్, పవన్‌కుమార్ బాధ్యులని తేల్చారు. ఈశ్వర్ మినహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన విద్యార్థినిని డీబార్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ బి.కిశోర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.