రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది.
కొనసాగిన మున్సిపల్ కార్మికుల నిరసనలు
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాల వద్ద మంగళవారం మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించారు.
ఇదిలాఉండగా ప్రభుత్వం ఒకవైపు చర్చల పేరుతో బుజ్జగిస్తూనే మరోవైపు సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేస్తోంది. సమ్మెకు దిగిన పర్మినెంట్ ఉద్యోగులకు సర్వీస్ బ్రేక్ అవుతుందని,బెదిరిస్తోంది. కాగా విశాఖలో మున్సిపల్ కార్మికులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.బుధవారం రాజమండ్రిలో జేఏసీతో చర్చలు జరుపుతామని గంటా ప్రకటించారు.