26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా
విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు.
ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
20న పదో తరగతి ఫలితాలు విడుదల
Published Tue, May 12 2015 4:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement