విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరం మరి కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లతో అభివృద్ధి చెందనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎ.గిరిధర్ అన్నారు. నగరంలోని ఓ హోటల్ లో శుక్రవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓ చిన్న మత్స్యకార పల్లెగా ఉన్న విశాఖ ఇప్పుడు సకల సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసే ఒక బృహత్ ప్రయత్నానికి విశాఖ వేదికైంది. వైజాగ్ ఫెస్ట్-2015కు శుక్రవారం సాయంత్రం తెర లేచింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిని ప్రారంభించారు.
బుక్స్ బుక్స్ లవ్లీ బుక్స్
వైజాగ్ ఫెస్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన చదువరులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ చరిత్రకారుడు బిపిన్‌చంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 200 వరకూ బుక్ స్టాల్స్ నెలకొల్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రజాశక్తి బుక్‌హౌస్, వి శాలాంధ్ర ప్రచురణ సంస్థ, పీకాక్ క్లాసిక్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లా క్‌స్వాన్, జనవిజ్ఞాన వేదిక, ఎమెస్కో, బుక్స్‌వాలా, సైన్స్ యూనివర్సల్ వంటి 115 పబ్లిషింగ్ సంస్థల ప్రచురణలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గొల్లపూడి వీరాస్వామి సన్స్, అనల్ప బుక్స్, నీల్‌కమల్ పబ్లికేషన్స్, జ్యోతి, హిమాంశు, గుప్తా తదితర బుక్ పబ్లిషర్స్ కూడా స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. కంప్రింట్, ఆపిల్ ట్రీ సంస్థలు పిల్లల విజ్ఞానానికి సంబంధించిన రూపొందించిన సీడీలు, డీవీడీలు కూడా ప్రదర్శనలో ఉంచారు.
వామపక్ష సాహిత్యం...
అరుదైన వామపక్ష సాహిత్యాన్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఇరిక్ హాఫ్‌జ్‌బామ్ ‘హౌ టు చేంజ్ ది వరల్డ్’, మార్తా హర్ణేకర్ ‘రీ బిల్డింగ్ ది లెఫ్ట్’, విజయ్ ప్రసాద్ ‘నో ఫ్రీ లెఫ్ట్’, ‘ది పూరర్ నేషన్స్’ వంటివి ఉన్నాయి. ఆకార్, లెఫ్ట్ వరల్డ్, నేషనల్ బుక్ ఏజెన్సీ, వర్షా బుక్స్, సంస్కృతి, పీపుల్స్ పబ్లికేషన్స్ హౌస్ తదితర సంస్థల ప్రచురణలు ఉన్నాయి. అరుంధతి రాయ్ రచన ‘అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’, అమితా కనేకర్ రచన ‘ఎ స్పోక్ ఇన్ ది వీల్’ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థుల సందడి...
సర్ సీవీ రామన్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో పలు నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మెడికల్ కాలేజీ విద్యార్థులు 80 వరకూ ఎగ్జిబిట్స్‌ను ఏర్పాటు చేశారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు తాము రూపొందించిన పలు మోడల్స్‌ను ఇక్కడ ప్రదర్శించారు. ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థలు, హ్యాండీక్రాఫ్ట్, చేనేత సహకార సొసైటీలు తమ ఉత్పత్తులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనకు జవహర్‌లాల్ నెహ్రూ వేదికగా పేరు పెట్టారు. వాటిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్లాంట్ నమూనా ప్రత్యేకంగా నిలిచింది.
ఫుడ్ ఫెస్టివల్...
ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ ఆహార పంటల ఆవశ్యకతను వివరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా స్టాల్స్ సందర్శకులకు నోరూరిస్తున్నాయి.
‘నిర్భయ’ కళారూపం వాయిదా
ఢిల్లీలో జరిగిన సంచలన ‘నిర్భయ’ ఘటనపై రూపొందించిన భారీ కళారూపం ఆవిష్కరణ వాయిదా పడింది. వైజాగ్ ఫెస్ట్ వేదిక వద్ద దీన్ని గురువారమే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే కళాఖండాల ఏర్పాటు ఆలస్యమవడం తో శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం ఉదయం క్రేన్‌తో పైకి లేపినప్పుడు బొమ్మ కింద పడిపోయింది. దీన్ని పునఃప్రతిష్టించేందుకు సాయంత్రం వరకూ కళాకారులు ప్రయత్నించారు. శనివారం ఉదయం దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసం, వర్తమాన సాహిత్యం-సవాళ్లు, మీడి యా తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి.
కనుల పండువగా వైజాగ్ ఫెస్ట్
Published Sat, Apr 11 2015 2:34 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement