
సీతమ్మధార: విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సమక్షంలో ఈనెల 20వ తేదీన ఆ పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం సీతమ్మధారలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం సీతమ్మధారలోని తన నివాసం నుంచి కార్లు, బస్సుల్లో తన మద్దతుదారులతో ర్యాలీగా విజయవాడ బయలుదేరుతా నని చెప్పారు.
పెందుర్తిలో పోటీ చేసేందుకు జనసేన నుంచి ఎలాంటి హమీ తీసుకోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీలో వ్యక్తిగత లబ్ధి కోసం ఏరోజు అడగలేదన్నారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగత విమర్శలు చేయడానికి తాను దూరంగా ఉంటానన్నారు. అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన ప్రకారమే పార్టీలో పనిచేస్తానన్నారు.