తప్పు చేస్తే రాజకీయ సన్యాసం:టీడీపీ ఎమ్మెల్యే
విశాఖపట్నం: తప్పు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గానికి చెందిన యలమంచిలి
ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. తాను ఎస్ఐ ట్రాన్స్ఫర్ కోరుకోలేదని చెప్పారు. మంత్రి గంటా వర్గం ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. మైనింగ్ లీజు విషయంలో ఎమ్మార్వోను అడిగే హక్కు ఎస్ఐకి ఉందా? అన్న విషయంపైనే ఎస్పీని అడిగినట్లు చెప్పారు. దానికి ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.
అమ్మవారి జాతర విషయంలో ఎస్పీ సహకరించడంలేదనే డీజీపీని కలిసినట్లు చెప్పారు. తనకు, మాజీ ఎమ్మెల్యేలకు ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పారు. పది మంది ఎమ్మెల్యేలకు అక్రమ గ్రావెల్స్, ఇసుక రవాణా లేవని తెలిపారు. ఒకవేళ ఉంటే రాజీనామా చేస్తామని రమేష్ బాబు చెప్పారు.