టీడీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్ | TDP MLA Panchakarla Ramesh Babu overaction | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్

Published Thu, Jan 26 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

టీడీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్

టీడీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్

విశాఖపట్నం: ప్రత్యేక హోదా పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసగా తెలిపేందుకు వస్తున్న వారిపై దౌర్జన్యం చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు అత్యుత్యాహం ప్రదర్శించారు. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశిస్తూ హల్ చల్ చేశారు. తన వాహనంలో తిరుగుతూ ఆందోళనకారుల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమచారం చేరవేస్తున్నారు.

ఎమ్మెల్యే తీరుపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధి అయివుండి గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపకుండా అణిచివేయాలని చూడడం దారుణమని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement