సాక్షి, విశాఖపట్నం : విశాఖలో విషవాయువు వలయంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం సంస్థలు భోజన వసతిని కొనసాగిస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించి బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఈ సంస్థలు రెండో రోజు కూడా తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాయి. బాధిత కుటుంబాలు తల దాచుకున్న షెల్టర్ హోమ్స్ వద్దకు ఆహార ప్యాకెట్లను నేరుగా సరఫరా చేస్తున్నాయి. అధికారుల సూచన మేరకు రెండు పూటలూ భోజన వసతి కల్పించేందుకు విశాఖ శారదాపీఠం వానప్రస్థం సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఐదు వేలు రాత్రికి మరో అయిదు వేల చొప్పున మొత్తం పదివేల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాయి. విశాఖ శారదాపీఠం ట్రస్టు సభ్యులు, వానప్రస్థం వృద్ధాశ్రమ సంస్థ నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. (గ్యాస్ లీకేజీ: చంద్రబాబు వ్యాఖ్యల సరికాదు)
Comments
Please login to add a commentAdd a comment