
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని గుర్తు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గ్యాస్ లీకేజీ ఘటనపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పదిరోజుల్లోనే పరిహారం అందించారు.
(చదవండి: బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట)
Comments
Please login to add a commentAdd a comment