చంద్రబాబు వచ్చారు.. వెళ్లారు | TDP chief Chandrababu went to Hyderabad again | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వచ్చారు.. వెళ్లారు

Published Sat, May 30 2020 5:13 AM | Last Updated on Sat, May 30 2020 5:13 AM

TDP chief Chandrababu went to Hyderabad again - Sakshi

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు నానా హడావుడి చేసిన చంద్రబాబు రెండ్రోజులు కూడా గడవకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఉండవల్లి నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ వెళ్లారు. ఈ నెల 25న ఎల్‌జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికి వచ్చేందుకు చంద్రబాబు డీజీపీ అనుమతి కోరారు.

ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు డీజీపీ అనుమతిచ్చారు. కానీ, ఆ రోజు రాష్ట్రంలో ప్రారంభం కావాల్సిన విమాన ప్రయాణాలన్నీ రద్దుకావడంతో బాబు విశాఖకు వెళ్లకుండా రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. వచ్చిన తర్వాతైనా విశాఖ వెళ్లే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు. రెండ్రోజులపాటు ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించారు. అది ముగిసిన తర్వాతైనా విశాఖ వెళ్తారని పార్టీ నాయకులు భావించారు. కానీ, అనూహ్యంగా అది ముగిసిన మర్నాడే చంద్రబాబు సైలెంట్‌గా హైదరాబాద్‌ వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement