
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విశాఖ గ్యాస్ లీక్ బాధితులు త్వరగా కోలుకున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. విశాఖపట్నం ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పరిహారం త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం చాలా బాగా స్పందించిందని గుర్తుచేశారు. ప్రతి ఇంటి తలుపు తట్టి అధికారులు సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 554 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. 128 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారని చెప్పారు.
కేజీహెచ్‌లో 305 మంది ఉన్నారని.. వీరిలో 52 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. మిగతావారు ప్రైవేటు ఆస్ప్రతుల్లో చికిత్స పొందుతున్నారని.. ఎవరికీ ప్రాణప్రాయం లేదని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. వైద్యులు, నిపుణలు సూచించేవరకు ప్రమాద స్థలానికి ఎవరూ వెళ్లొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment