
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగటానికి పరిశ్రమ యాజమాన్య వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడానికి తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల సూచనల మేరకే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని జనావాసాల మధ్య నుంచి తరలిస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాలలో పూర్తిగా కెమికల్ శుద్ది చేసిన తర్వాతే ప్రజలని ఇళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. చంద్రబాబులా తాము ఏది పడితే అది మాట్లాడలేమన్నారు. రేపటి నుంచి బాధితులకి నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. టీడీపీది డ్రామా కంపెనీ.. స్క్రిప్ట్ చదివి నాటకం రక్తి కట్టించామా లేదా అని చూసుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు.