సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఎ) నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వివేక్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. సంఘటన ఎలా జరిగింది. లీకేజీకి సంబంధించిన అంశాలు విపులంగా పరిశీలించనుంది.
వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల వినతులు అధ్యయనం చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి నుంచి సమాచారం సేకరించడానికి కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు నివేదికలు రావడంతో పూర్తిస్థాయి ముసాయిదా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందుకోసం మూడు రోజులపాటు హైపవర్ కమిటీ వివిధ వర్గాలతో వరుసు భేటీలు నిర్వహించనుంది. చదవండి: బాబాయ్ భ్రష్టు పట్టించారు
Comments
Please login to add a commentAdd a comment