ఎల్‌జీ పాలిమర్స్ బాధితురాలికి చెక్కు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఆరిలోవ(విశాఖ తూర్పు)/రాజాం/సంతకవిటి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన దుర్ఘటనలో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 147 మందికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం చెక్కులు అందజేశారు. ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆస్పత్రిలో మంత్రి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విచారణ కమిటీ రిపోర్టును ఆధారంగా కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తూ బాధితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు.
మెడికో కుటుంబానికి రూ.కోటి అందజేత
ఈ ప్రమాదంలో మృతిచెందిన మెడికో విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తల్లిదండ్రులు పద్మావతి, ఈశ్వరరావులకు కూడా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని కావలి గ్రామంలో రూ.కోటి చెక్కును మంత్రి ధర్మాన కృష్ణదాస్ శనివారం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment