
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారని తెలిపారు.
(‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’)
ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాయని.. కానీ చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజలను వదిలేసి నేరుగా ఫ్యాక్టరీకే వెళ్తానన్నప్పుడే చంద్రబాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. విచారణ అనంతరం కంపెనీపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం కంపెనీకి అనుకూలంగా మాట్లాడాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుబట్టారు.
(‘అవే ఆయనకు దినచర్యగా మారాయి’)
Comments
Please login to add a commentAdd a comment