
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు విశాఖ రావాలనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి మూడు వారాలు అవుతోందని, ఇప్పుడు వచ్చి బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు.
‘‘రాజకీయం చేయడానికే చంద్రబాబు రావాలనుకుంటున్నారు. ఆయన వస్తోంది పరామర్శకు కాదు.. రాజకీయం కోసం.. 24 గంటలు ఆయన రాజకీయం కోసమే పనిచేస్తారని’’ అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు. గ్యాస్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చారని.. ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్యాకేజీ ఇవ్వలేదని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.