సాక్షి, విశాఖపట్నం: 2015లో ఎల్‌జీ పాలిమర్స్ విస్తరణకు మాజీ సీఎం చంద్రబాబే అనుమతులిచ్చి, ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం సర్క్యూట్‌హౌస్‌లో మంత్రుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిందని, అప్పుడే ఆ సంస్థపై తగిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఇప్పుడు తనకేమీ తెలియదని, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు అండ్ కో మాట్లాడడం సరికాదన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
► మీరు సీఎంగా ఉన్నప్పుడే జీవీఎంసీ పరిధిని అక్కడ వరకు పెంచినప్పుడు ఆ సంస్థతో అక్కడ ప్రజలకు హాని అని తెలియలేదా?
► మీరు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే ఎం.ఆంజనేయులు లేఖ రాస్తే ఎందుకు స్పందించలేదు?
► ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే బాధితులను సీఎం పరామర్శించి, అధికారులతో, సంస్థ యాజమాన్యంతో సమీక్షలు నిర్వíహించడమే కాకుండా, మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించారు.
► ఎల్జీ పాలిమర్స్ చేసిన తప్పిదాలపై యాజమాన్యాన్ని ఆరా తీసి, వాటిపై ఉన్నతస్థాయి కమిటీని వేసిన విషయం గుర్తుంచుకోవాలి.
గ్యాస్ లీకేజీ బాధితులకు నేడు పరిహారం
మంత్రులు కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి
గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు సోమవారం పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు విశాఖ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కన్నబాబు, మంత్రులు బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్‌హౌస్‌లో మంత్రులు విలేకరులతో మాట్లాడారు.మృతుల కుటుంబాలకు, డిశ్చార్జి అయినవారికి, పశువులను కోల్పోయిన రైతులకు ఆదివారమే చెక్కులు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఇందుకు సంబంధించి సీఎస్ నీలం సాహ్ని, కలెక్టరు వి.వినయ్‌చంద్ ఇప్పటికే ఏర్పాట్లు చేశారని సాంకేతిక కారణాల వల్ల చెక్కుల పంపిణీ ఆదివారం కుదర్లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment