
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులను పరామర్శించి మానసిక ధైర్యం అందించారని పేర్కొన్నారు. ఐదుగురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు కూడా బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో భరోసా నింపారన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా బాధితులందరికీ తక్షణ పరిహారం అందించామని మంత్రి పేర్కొన్నారు.
(మార్గదర్శకాలను పాటించాలి: కేంద్ర బృందం)
స్టైరిన్‌ను కొరియా తరలించాం..
బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించామని, వైఎస్సార్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి అవంతి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ కూడా కొరియా కు తరలించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత గ్రామ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
(‘ఆ దిశగా ఆలోచిస్తే బాగుండేది’)
Comments
Please login to add a commentAdd a comment