సాక్షి, సిటీబ్యూరో: రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఎలాంటి ప్రమాదకర గ్యాస్ వెలువరించే కంపెనీలు లేకపోవడంతో సిటీ సేఫ్ జోన్‌గా నిలిచింది. ఏపీలోని వైజాగ్ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకైన దుర్ఘటన నేపథ్యంలో నగరంలో ఇలాంటి పరిశ్రమలు లేవని పీసీబీ, పరిశ్రమల శాఖలు స్పష్టం చేశాయి. నగరంలో ఎల్పీజీ గ్యాస్ కేంద్రాలు మినహా ఎలాంటి విషవాయువులు వెలువరించే కంపెనీలు, సంస్థలు లేవని తెలిపాయి. నగరంలోని బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు సహా ఇతర పరిశ్రమలు సైతం పీసీబీ, పరిశ్రమల శాఖ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment