సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్‌కు చెందిన మహేశ్వర్ వంట గ్యాస్ బుక్ చేయడంతో సిలిండర్ డోర్ డెలివరీ అయింది. కొత్త సిలిండర్ రీఫిల్‌కు రెగ్యులేటర్ అమర్చిన కొన్ని గంటల తర్వాత గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు వాసన వచ్చింది. పైప్‌ను పరిశీలిస్తే అంతా సవ్యంగానే కనిపించింది. రెగ్యులేటర్ కింద నుంచి గ్యాస్ లీకవుతున్నట్లు గమనించి తక్షణమే దానిని తొలగించి తిరిగి సీల్ మూత బింగించారు. గ్యాస్ ఏజెన్సీకి ఫోన్‌చేస్తే మరుసటి రోజు సంబంధిత నిపుణుడు వచ్చి తనిఖీ చేసి సిలిండర్ నాజిల్‌లోని వాచర్ మార్చాడు. రూ.300 చార్జీలు వసూలు చేశాడు. సిలిండర్ నాజిల్‌లో వాచర్ సమస్య ఎందుకు వస్తుందని అడిగితే వాచర్ నాసిరకంతో పాటు రెగ్యులేటర్‌తోనూ సమస్యగా పేర్కొన్నాడు. ఇది ఒక మహేశ్వర్‌కు ఎదురైనా సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వినియోగదారులు గ్యాస్ లీకేజీ సమస్యను ఎదుర్కొంటున్నావారే.
►కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచి గ్యాస్ లీకవుతో ఉంటుంది. తాజాగా సిలిండర్ నాజిల్‌లోని వాచర్ నుంచి కూడా లీకేజీలు బయటపడుతున్నాయి. నిపుణులు వచ్చి పరిశీలిస్తే గాని గుర్తించలేని పరిస్థితి. అప్పటి వరకు సిలిండర్ సీల్‌ను మూసి ఉంచాల్సి ఉంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. నాజిల్‌లో నాసిరకం వాచర్‌లు అమర్చడం లీకేజీలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
►కొన్ని పర్యాయాలు రెగ్యులేటర్ ఒత్తిడితోనూ వాచర్ కదిలి గ్యాస్ లీకేజీ అవుతోందని వారంటున్నారు. సిలిండర్ రీఫిల్ సమయంలోనే ఆయిల్ కంపెనీలు వాటిని పరిశీలిస్తే సమస్య ఉత్పన్నం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు మాత్రం కేవలం తాత్కాలిక ఉపశనం కలిగించేలా వాచర్లను మార్చుతుందే తప్ప శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: (రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు)
లీకేజీకి కారణాలు..
►ఎక్కువ శాతం సిలిండర్, స్టౌలను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ద్వారా లీకేజీలు ఉంటాయి. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌకు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌకు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది.
►ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండుసూది మొన పరిమాణంలో రంధ్రం ఏర్పడి దీనిలోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది.
►ఎల్పీజీకి వ్యాకోచ శక్తి ఎక్కువ. లీకేజీతో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా మంట అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment