
సాక్షి, తాడేపల్లి : వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగులు హాజరయ్యారు. అధికారులు గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి తెలియజేశారు. సంఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. సాయంత్రం లోపు బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని.. రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. ( ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే )
అంతకుక్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment