
సాక్షి, విశాఖపట్నం : ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పలువురికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారు.
ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం ప్రాతిపదికగా కాకుండా పూర్తిగా ఆరోగ్యం నిలకడగా మారేంతవరకు సహాయం అందిస్తుందని దీనికి ఎంత భారమైనా భరించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment