
సాక్షి, విశాఖ : అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా ఎంపీలు సత్యనారాయణ డాక్టర్ సత్యవతి మాధవితో పాటు ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, కన్నబాబు రాజు సహా పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు . అందులో భాగంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రోడ్డు వాకింగ్, సైకిల్ ట్రాక్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని, అయితే ఓ పార్టీతో అనుబంధం ఉన్న పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. (వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ. 510.01 కోట్లు జమ)


Comments
Please login to add a commentAdd a comment