walkthan
-
లండన్‌లో శారీ వాకథాన్
భారతీయ చేనేత కళాకారులను, నేత కార్మికులను ప్రోత్సహించడానికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా లండన్‌లో బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్, ఐఐడబ్ల్యూ సహకారంతో లండన్‌లో శారీ వాకథాన్-2023 నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా భారతీయ మహిళలు వారి సాంప్రదాయ చేనేత చీరలు ధరించి కార్యక్రమానికి తరలివచ్చారు. వారంతా తమ ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ సెంట్రల్ లండన్‌లోని చారిత్రక ప్రదేశాల మీదుగా నడిచారు. ఈ వాకథాన్ ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి ప్రారంభమై, 10 డౌనింగ్ స్ట్రీట్ దాటి, మన జాతీయ గీతం, కొన్ని ప్రాంతీయ ప్రదర్శనలతో పార్లమెంట్ స్క్వేర్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ముగిసింది. తెలంగాణకు చెందిన గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో 40 మందిపైగా తెలంగాణ మహిళల బృందం ఈ వాకథాన్ 2023లో పాల్గొంది. భారతీయ చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు, భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా అంతర్జాతీయ ప్రదర్శనలు చేనేత కార్మికుల జీవనోపాధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలంగాణ కోఆర్డినేటర్లు ప్రతిమ, జ్యోతి, అనూష, సాధన, సింధు, గోదా పేర్కొన్నారు. -
'విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది'
సాక్షి, విశాఖ : అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా ఎంపీలు సత్యనారాయణ డాక్టర్ సత్యవతి మాధవితో పాటు ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు రాజు సహా పెద్ద సంఖ్యలో నగర వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు . అందులో భాగంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రోడ్డు వాకింగ్, సైకిల్ ట్రాక్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని, అయితే ఓ పార్టీతో అనుబంధం ఉన్న పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. (వైఎస్సార్ చేయూత రెండో దశలో రూ. 510.01 కోట్లు జమ) -
విజయవాడలో ఐటీశాఖ వాక్‌థాన్
విజయవాడ: నగరంలోని ఎంజీ రోడ్డులో శనివారం ఉదయం ఐటీ శాఖ ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ కార్యదర్శి శ్రీవాత్సవ ప్రారంభించారు. రెండు కిలో మీటర్ల మేర సాగిన ఈ వాక్‌లో సంయుక్త పోలీసు కమిషనర్ హరికుమార్, ఆదాయపన్ను శాఖ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.