అమరావతి: వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాం లోనే ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు తనకేమి పట్టనట్లు ఉన్న చంద్రబాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడని ట్విటర్ వేదికగా విమర్శించారు. పొస్కొకంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్ 22న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రస్తావించిన సంగతిని గుర్తు చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఇప్పటికైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment