మెట్రోరైల్, రైల్వే జోన్ ఏర్పాటుకు విజయమ్మ హామీ
విశాఖ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వైఎస్ఆర్ పథకాలు మీకందుబాటులోకి వస్తాయని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎస్సీఎస్టీ సంఘాలతో సమావేశమైన వైఎస్ విజయమ్మ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాలకు అండగా ఉంటామని విశాఖ లోక్‌సభ అభ్యర్థి పోటీ చేస్తున్న వైఎస్ విజయమ్మ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్క్షప్తి చేశారు.
ఆతర్వాత వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పారిశ్రామికవేత్తలతో వైఎస్ విజయమ్మ సమావేశమయ్యారు. విశాఖలో పరిశ్రమల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. 2019కల్లా నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు కృషిచేస్తామని విజయమ్మ తెలిపారు. విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డినే అని అన్నారు. విశాఖలో మెట్రోరైల్, రైల్వే జోన్ ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని విజయమ్మ అన్నారు.