విశాఖలో ఐటీ ప్రొఫెషనల్స్ తో విజయమ్మ భేటీ
విశాఖపట్నం నగరాన్ని మోడల్ సిటీగా చేయాలనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆ పార్టీ విశాఖపట్నం లోక్సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో రైతు సంఘాల నేతలు, ఐటీ నిపుణులు, ఉద్యోగులతో మిలీనియం సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ విజయమ్మ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో 500 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విశాఖపట్నంలో టీడీపీకి షాక్ తగిలింది. నగరంలోని ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్, యాదవ సంఘం నేత భరనికాన రామారావు టీడీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బీసీలకు బాబు అన్యాయం చేశారని రామారావు ఆరోపించారు.