అనంతపురం ఎడ్యుకేషన్ : గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి (ఆర్‌వీఎస్) రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని జోన్‌ను గుంతకల్లుకు కేటాయించాలనే డిమాండ్‌తో అక్టోబర్ 1న గుత్తి నుంచి గుంతకల్లు వరకు నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల గేటు ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గుంతకల్లు జోన్ ఏర్పాటుకై చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.