
గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి
– రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్ : గుంతకల్లును రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సమాఖ్య, రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల హాస్టల్ నుంచి ర్యాలీగా బయలుదేరి టవర్‌క్లాక్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ జోన్‌కు గుంతకల్లు అన్ని విధాలా అనుకూలం అన్నారు.
అలాగే అనంతపురం రైల్వే స్టేషనల్‌లో అన్ని రైళ్లూ ఆపాలన్నారు. సామాన్యులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి కన్వీనర్ వై.రాజశేఖర్‌రెడ్డి, విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.సీమకృష్ణ, నాయకులు భార్గవ, కుమార్‌నాయక్, భగ్గీ, రవినాయక్, మల్లికార్జున, శ్రీనివాస్, హరికృష్ణ పాల్గొన్నారు.