ఏపీ సెంటిమెంట్‌ను గుర్తించాం..
త్వరలోనే శుభవార్త వింటారు
రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి సురేష్‌ప్రభు
విశాఖపట్నం: ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇది మీకే కాదు నాకూ సెంటిమెంటే. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదే‘‘రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్‌ను మేం గుర్తించాం. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.శ్ శుభవార్తను వింటుందని ఆశిస్తున్నా’’ అని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ బుధవారం ‘జన్‌కల్యాణ్ పర్వ్’ పేరిట సభ నిర్వహించింది. దీనికి సురేష్‌ప్రభు హాజరై ప్రసంగించారు. సభలో తొలుత ప్రసంగించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించాలని విన్నవించారు.
సభకు హాజరైనవా రు సైతం రైల్వేజోన్‌కోసం డిమాండ్ చేశారు. సురేష్ ప్రభు మాత్రం రైల్వేజోన్ విషయంలో స్పష్టమైన ప్రకటనగానీ, హామీగానీ ఇవ్వలేదు. ‘నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మేం ఇచ్చిన హామీలన్నింటినీ ఐదేళ్లలో పూర్తిచేస్తాం. అనంతరమే మళ్లీ తీర్పుకోసం ప్రజల వద్దకు వస్తాం’ అని ఆయన అన్నా రు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ మనసులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఏపీని అభివృద్ధిలోనూ సూపర్ నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషిచేస్తోంది’’ అని చెప్పారు.
అగ్రగామిగా భారతీయ రైల్వేలు
రాబోయే 15ఏళ్లలో రూ.8.50 లక్షల కోట్లతో భారతీయ రైల్వేరంగాన్ని ఆధునీకరించి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని సురేష్‌ప్రభు చెప్పారు.