బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్!
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్న విశాఖ జిల్లా అరుకులో కాఫీ ఉత్పత్తిని అంతర్జాతీయ బ్రాండ్గా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సదరు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మిషన్ పద్దతిలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి.... వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేయడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. కాఫీ సాగుకు కాఫీ బోర్డు మాజీ అధ్యక్షుడు గోపాలరావును ఇంఛార్జ్గా నియమించినట్లు చెప్పారు. సాగర్ నీటి విడుదల అంశంలో తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు.
నీటి విషయంలో అందరం కూర్చుని సమస్యను పరిష్కరించుకుందామని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. ఏపీ పునర్విభజనలో చట్టంలోని ప్రతి అంశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటను ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అన్న అంశం రానున్న బడ్జెట్లో ఉందని స్పష్టమైన సంకేతాలు తమకు అందాయని పరాకల ప్రభాకర్ వెల్లడించారు.