విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్‌నాథ్ దీక్షాభగ్నంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్‌నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
దీక్షాభగ్నంపై వైఎస్సార్‌సీపీ నిరసనలు
Published Mon, Apr 18 2016 11:44 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement