Initiation ruined
-
దీక్షాభగ్నంపై వైఎస్సార్సీపీ నిరసనలు
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ దీక్షాభగ్నంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
అంగన్వాడీల దీక్ష భగ్నం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తమ సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఐదు రోజులుగా వీరు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉద యం ఆరు గంటలకు పోలీసులు బలవంతంగా వీరి దీక్షను భగ్నం చేశారు. దీంతో అంగన్వాడీలు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈనెల 17నుంచి అంగ న్వాడీలు మూసి ఆందోళన తెలుపడానికి సిద్ధమవుతున్నారు. ఎంత పోరాడుతున్నా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శనివారం దీక్ష భగ్నం చేసే సమయంలో అంగన్వాడీ సిబ్బందికి, పోలీసులకు తోపులాట జరిగింది. దీక్షలో కూర్చున్న వారు నీరసించి ఉండడంతో పోలీ సులు వారిని అరెస్ట్ చేసి జిల్లా కేంద్రాస్పత్రికి తరలిం చారు. ఈ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. విజ యనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ రెండేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ ప్ర భుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రాణాలకు తెగించి దీక్షలు చేపడితే సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు బలవంతంగా పోలీసులతో దీక్షలు భగ్నం చేయటం అన్యాయమన్నా రు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీల డి మాండ్లను అంగీక రించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.రామచంద్రరావు,బి.సుధారాణి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తల దీక్ష భగ్నం
పాతగుంటూరు, న్యూస్‌లైన్ :సమస్యలు పరిష్కారించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న 14 మంది అంగన్వాడీ కార్యకర్తల ఆరోగ్యం క్షీణించడంతో నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి 12 గంటలకు దీక్ష శిబిరం వద్దకు చేరుకొన్నారు. దీక్ష విరమించాలని వారిని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు చెప్పడంతో, వారిని మహిళా పోలీసులు బలవంతంగా జీపుల్లోకి ఎక్కించి జీజీహెచ్‌కు తరలించారు. నగరంలో అంగన్వాడీ కార్యకర్తల ర్యాలీ విద్యానగర్(గుంటూరు): అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని కంకరగుంట గేటు నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకూ అంగన్వాడీ కార్యకర్తల, ఆయాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఐటీసీ వంటి సంస్థల జోక్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నగర అధ్యక్షురాలు షకీలా మాట్లాడుతూ అమృత హస్తం పెండింగ్ బిల్స్ వెటనే చెల్లించాలని, వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డింమాడ్స్ను నెరవేర్చకుంటే ఈనెల 17 నుంచి సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో క్వారీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రామయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.