విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తమ సమస్యల ను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఐదు రోజులుగా వీరు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉద యం ఆరు గంటలకు పోలీసులు బలవంతంగా వీరి దీక్షను భగ్నం చేశారు. దీంతో అంగన్‌వాడీలు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈనెల 17నుంచి అంగ న్‌వాడీలు మూసి ఆందోళన తెలుపడానికి సిద్ధమవుతున్నారు. ఎంత పోరాడుతున్నా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శనివారం దీక్ష భగ్నం చేసే సమయంలో అంగన్‌వాడీ సిబ్బందికి, పోలీసులకు తోపులాట జరిగింది. దీక్షలో కూర్చున్న వారు నీరసించి ఉండడంతో పోలీ సులు వారిని అరెస్ట్ చేసి జిల్లా కేంద్రాస్పత్రికి తరలిం చారు.
ఈ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. విజ యనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ రెండేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ ప్ర భుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రాణాలకు తెగించి దీక్షలు చేపడితే సమస్యలు పరిష్కరించాల్సిన సర్కారు బలవంతంగా పోలీసులతో దీక్షలు భగ్నం చేయటం అన్యాయమన్నా రు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్‌వాడీల డి మాండ్లను అంగీక రించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.రామచంద్రరావు,బి.సుధారాణి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల దీక్ష భగ్నం
Published Sun, Feb 16 2014 4:21 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement