gudivada amarnadh
-
వైఎస్సార్ ఏపీ 1 పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023- 27 వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, డైరెక్టర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తల ఆలోచనల్ని పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఎకనామికల్ గ్రోత్ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఏపీ పోర్టల్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు వారాల్లోనే పరిశ్రమలకు భూమి కేటాయింపు ఉంటుందన్నారు. దేశంలో 3 కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు. విశాఖ వేదికగా జీ20 సదస్సుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు రేపట్నుంచి 30 వరకు జరగనుంది. ఇందుకు 40 దేశాల నుంచి 200 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖలో జీఐఎస్ విజయవంతం కాగా జీ20 సదస్సును కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను అత్యంత సుందరంగా జీవీఎంసీ అధికారుల తీర్చిదిద్దారు. -
నాలుగు అంతస్థుల ఉన్న వారికి పెన్షన్ ఇవ్వాలా?: అమర్నాథ్
-
గుడివాడ అమర్ నాథ్ అనే నేను..
-
లోకేష్ ఆయనకు వారసుడు కాదు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
టీడీపీ ఎంపీలకు వైఎస్సార్సీపీ నేత సవాల్
సాక్షి, విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందో, లేక రైల్వేశాఖ మంత్రి ఇంటి ముందో ధర్నా చేయాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ నేతల డ్రామాలను జనాలు గుర్తించారని, ఇక స్థానిక రైల్వేస్టేషన్లలో రైల్వే జోన్ గురించి దీక్ష చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలతో ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని, నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ అంశాన్ని ఆరు నెలల్లోగా తేల్చాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. అదే విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీపై కూడా 6 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఉండగా.. ఈ నాలుగేళ్లు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతల డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో నేడు టీడీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నట్లు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేసిన పోరాటాన్ని గుర్తుకుచేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులను కలుపుకుని పోరాటం చేస్తే వైఎస్సార్సీపీ నేతలను అధికార టీడీపీ నేతలు అవహేళన చేశారు. ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ నాయకులకు నిజంగా సిగ్గుందా అని ప్రశ్నించారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందనగా ఇప్పుడు దీక్షలేందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా ఏం లాభం లేదు. ఈ ఏడాది మార్చి వరకు టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించారు. కానీ ఏం సాధించారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలరోజుల్లో ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఆ ఎంపీ ఇటీవల ఢిల్లీలో ఏం మాట్లాడారో ఏపీ మొత్తం చూసింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలను ఏపీ ప్రజలు ఓసారి గుర్తుచేసుకోవాలి. జోను లేదు.. గీను లేదు అంటూ చాలా చులకనగా మాట్లాడి అవంతి శ్రీనివాస్ దొరికిపోయారు. మరో ఎంపీ మురళీమోహన్ అయితే 5 కేజీల బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి అనడం వీడియోల్లో స్పష్టంగా చూశాం. ఎన్డీఏ నుంచి బయటకొచ్చినప్పటికీ బీజేపీకి టీడీపీ ఎంపీలు రహస్య మిత్రులుగా ఉన్నారు. టీడీపీ చేసిది దీక్షలు కాదు కిట్టీ పార్టీల్లా ఉన్నాయంటూ’ ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని టీడీపీ నేతలపై గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
రూ.1,500 కోట్ల భూ కుంభకోణం
వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడి సాక్షి,హైదరాబాద్: విశాఖపట్నం దసపల్లాహిల్స్‌లో రూ.1,500 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పేర్కొన్నారు. విశాఖలోని ‘రాణి కుమలదేవి’ ప్రభుత్వ భూమిని సీఎం తనయుడు లోకేశ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో అమర్నాథ్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కోర్టు వివాదంలో ఉన్న సర్వే నం.1196లోని 18.38 ఎకరాల భూమికి సంబంధించి లోకేశ్ తన బినామీలతో 52 దొంగ డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ భూమిలో రెండు వేల గజాలను టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి గతంలో చంద్రబాబు జీవో 556 విడుదల చేశారు. గత ఏప్రిల్‌లో లోకేశ్ కార్యాలయానికి శంకుస్ధాపన చేశారు. ఈ భూమి ప్రభుత్వ భూమిగా అప్పటి కలెక్టర్ యువరాజ్ ధృవీకరించారు . అయితే వాటి పత్రాలు ప్రభుత్వం దగ్గర లేవని చెప్పడం సిగ్గుచేటు. నారా లోకేశ్ షాడో సీఎంగా తయారయ్యారు. ఆయన దృష్టంతా రాష్ట్రంలోని విలువైన భూములు, అవినీతి మూటలపైనే ఉంది. విశాఖ భూముల విషయంలో బాబు, లోకేశ్ చేస్తున్న ఆరాచకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. ఈ భూమిని కాపాడుకోవడానికి అవసరమైతే సుప్రీం కోర్టులో పిల్ వేస్తాం.’ అని అమర్నాధ్ తెలిపారు. -
సీఎం రాష్ట్రానికా.. రాజధానికా..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజం డాబాగార్డెన్స్ : ‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. నీవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రివా? అమరావతి రాజధానికి మాత్రమే సీఎంవా?’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అనంతరం అతి పెద్ద నగరంగా విశాఖపట్నం అవతరిస్తుంటే.. ఇక్కడ కేటాయించిన విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగదాంబ కూడలి సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్(ఐఐపీఎం)ను కేంద్ర ప్రభుత్వం అనకాపల్లిలో ఏర్పాటు చేసేందుకు భూములు సేకరిస్తే.. అదే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జిల్లా కొండపల్లి ప్రాంతానికి తరలించడం సబబేనా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. గతంలో విశాఖలో ఏర్పాటు చేయాల్సిన ఐఎఫ్‌టీ(అటవీ సంస్థ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్(ఐఐపీ)ని కాకినాడకు తరలించేశారని, తాజాగా అనకాపల్లిలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయాల్సిన ఐఐపీఎంను కృష్ణా జిల్లాకు తరలించడంలో ఆంతర్యమేమిటన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఉన్న సంస్థను తరలించుకుపోతే ఈ ప్రాంత కేంద్ర, రాష్ట్ర మంత్రులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినట్టే, ఇప్పుడు అమరావతి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ప్రాజెక్టులన్నీ పెట్టుకుంటూ పోతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతేడాది భాగస్వామ్య సదస్సును విశాఖలో నిర్వహించిన సమయంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు పరిశ్రమలు వస్తున్నాయని ప్రకటనలు చేశారు గానీ.. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమమైనా రాలేదన్నారు. ఈ ప్రాంతాన్ని అవమానించేలా మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.లక్ష కేటాయించడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పిదాలనే తిరిగి చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లోని జరగాలని సూచించారు. రైల్వే జోన్‌పై మరోసారి వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతుందని గుడివాడ తెలిపారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థలకు సరిగ్గా నిధులు విడుదల చేయడం లేదన్నారు. హైకోర్టు బెంచ్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువన్నీ ప్రచార ఆర్భాటాలే తప్ప, చేసేది శూన్యమన్నారు. -
ఇంటింటికీ భరోసా
జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన గడపగడపకు వైఎస్సార్సీపీ విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జన బాహుళ్యంలోకి దూసుకెళుతున్న ‘గడప గడపకు వైఎస్సార్సీపీ’ కార్యక్రమం మూడో రోజు జిల్లా అంతటా విజయవంతంగా సాగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. జగనన్న పాలన వస్తే సమస్యలు తీరుతాయని వివరిస్తున్నారు. సీతంపేట 35వ వార్డు ప్రశాంతినగర్, సంజీవయ్య కాలనీల్లో విశాఖ-ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్, నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ర్ట నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, సిటీ ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్‌అలీ పర్యటించారు. తూర్పు నియోజక వర్గం పరిధి మూడోవార్డు ఇందిరానగర్‌లో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో పార్టీ తూర్పు కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విశాఖ నగరం 21వ వార్డులో పాల్గొన్నారు. ఆనందపురం మండలం శొంఠ్యాంలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కర్రి సీతారామ్, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్ పాల్గొన్నారు. అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. కె.కోటపాడు మండలంలోని లంకవానిపాలెం, పిండ్రంగి గ్రామాల్లో గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. జీకే వీధి మండలం జర్రెలలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గిరిజనుల ఇళ్లకు వెళ్లారు. బాక్సైట్ ప్రతిపాదిత మండలాలైన ఈ ప్రాంతాల్లో గిరిజనులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. తమ ఉనికిని ఈ ప్రభుత్వం దెబ్బకొడుతోందని, అక్రమంగా బాక్సైట్ తవ్వేందుకు సిద్ధపడినపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని అన్నారు. చింతపల్లి, పాడేరు జెడ్పీటీసీలు కె.పద్మకుమారి, బి.నూకరత్నం, జీకే వీధి ఎంపీపీ బాలరాజు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం నర్శింగరావుపేట దుర్గాలాడ్జి వీధిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు నమోదు చేసుకున్నారు. పాయకరావుపేట మండలం రాజవరంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్తలు గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ పాల్గొన్నారు. -
'యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ప్రాధ్యానత'
న్యూజెర్సీ: వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ విభాగం శుక్రవారం న్యూజెర్సీలోని ఎడిసిన్ నగరంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 'గడపగడపకూ వైఎస్ఆర్సీపీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతిపాలన, రెండేళ్ల పాలనలో టీడీపీ వైఫల్యాలను ఆయన వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందడుగు వేయాలంటూ యువతకు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ పాల త్రివిక్రమ్ భానోజిరెడ్డి మాట్లాడుతూ.. యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, యువనాయకత్వం వల్లే పార్టీ పునాదికి బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షపై ఆయన ప్రశంసించారు. అమెరికాలో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం సేవలను త్రివిక్రమ్ భానోజిరెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచి అవినీతిపై చూపించిన శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంలో చూపించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వందకుపైగా పాల్గొన్న వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ త్రివిక్రమ్ భానోజిరెడ్డి పాలా, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు సాత్విక్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నుతక్కి నాని తదితరులు పాల్గొన్నారు. -
దీక్షాభగ్నంపై వైఎస్సార్సీపీ నిరసనలు
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ దీక్షాభగ్నంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.