Leaders protests
-
ముద్రగడకు మద్దతుగా కాపు నేతల ఆందోళనలు
రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ దీక్షకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో కాపు నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి మండలం గోనాడలో శనివారం ఉదయం నేతలు రిలే దీక్షలకు దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండపేటలో ఇద్దరు కాపు నాయకులు సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అరెస్ట్‌ను నిరసిస్తూ కోరుకొండలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయినవెల్లి మండలం ముక్తేశ్వరంలో కాపు నేతల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాపు నేతలను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఏలూరు: ఆచండ నియోజకవర్గం మార్టేరులో వందలాది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిలో ధర్నా, మానవహారం చేశారు. ముద్రగడ దీక్షను విరమింపజేయాలని, ప్రభుత్వం కాపులకు న్యాయంచేయాలని నేతలు డిమాండ్ చేశారు. -
దీక్షాభగ్నంపై వైఎస్సార్సీపీ నిరసనలు
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ దీక్షాభగ్నంపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఇంఛార్జ్ అదీప్ రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొడ్డేటి ప్రసాద్, విశాఖ టౌన్ కన్వీనర్ జానకీ రామరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టీల్ ప్లాంట్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ కోసం అమర్నాథ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
భోగాపురంలో విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. అందులోభాగంగా నేటి నుంచి రెండు రోజులపాటు బాధిత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అయితే ముందస్తుగా ఎస్ కోటలో సీపీఐ నేత కామేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు నిరసనగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాల నేతలు ఈ రోజు ధర్నా నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.