కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ దీక్షకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో కాపు నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ దీక్షకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో కాపు నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి మండలం గోనాడలో శనివారం ఉదయం నేతలు రిలే దీక్షలకు దిగారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండపేటలో ఇద్దరు కాపు నాయకులు సెల్ టవర్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అరెస్ట్ను నిరసిస్తూ కోరుకొండలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయినవెల్లి మండలం ముక్తేశ్వరంలో కాపు నేతల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాపు నేతలను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఏలూరు: ఆచండ నియోజకవర్గం మార్టేరులో వందలాది మంది కాపు సామాజికవర్గానికి చెందిన వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిలో ధర్నా, మానవహారం చేశారు. ముద్రగడ దీక్షను విరమింపజేయాలని, ప్రభుత్వం కాపులకు న్యాయంచేయాలని నేతలు డిమాండ్ చేశారు.