
రైల్వే మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. మా ఉద్దేశాలు ప్రశ్నించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశాలేంటో బయటకు చెప్పాలని హితవు పలికారు. వారం రోజుల క్రితం కూడా జోన్ ఇవ్వాలంటూ బాబు లేఖ రాశారని.. ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇవ్వనంతకాలం మాపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. అసలు విశాఖ జోన్ ఇవ్వడం చంద్రబాబు అండ్ పార్టీకి ఇష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. అందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా(సౌత్ కోస్ట్)జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment