
'సుజనా కంపెనీలతో నాకెలాంటి సంబంధం లేదు'
ఢిల్లీ: సుజనా కంపెనీలతో తనకెలాంటి సంబంధం లేదని కేంద్ర సహయ మంత్రి సుజనా చౌదరి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... కోర్టు సమన్లు తనకే కాదని, ప్రధాని మోదీకి కూడా వస్తుంటాయన్నారు. ఆరోపణలు వస్తే ఆ కంపెనీలనే అడగాలని సుజనా సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని... ప్రస్తుత రైల్వే బడ్జెట్లో విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించే అవకాశముందన్నారు.
మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనాకు చెందిన కంపెనీ చెల్లించలేదని బ్యాంకు ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. మార్చి ఐదో తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.