కొంత అసంతృప్తి ఉంది.. అయినా... | sujana chowdary meeting with tdp mps in ap bhavan | Sakshi
Sakshi News home page

కొంత అసంతృప్తి ఉంది.. అయినా...

Published Wed, Jul 27 2016 11:27 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

కొంత అసంతృప్తి ఉంది.. అయినా... - Sakshi

కొంత అసంతృప్తి ఉంది.. అయినా...

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ... రెండేళ్లలో కొన్ని విషయాల్లో కేంద్రంపై కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయినా మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.


బీజేపీ మిత్రధర్మం పాటిస్తుందో లేదో  తెలపాలని అన్నారు.  ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తుందని.. అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ బయటపెడతామన్నారు. ఆర్థిక, హోంశాఖలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement