
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.
ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.

ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment