breaking news
pemmasani chandrasekhar
-
స్టార్‌లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్‌లింక్ భారత్‌లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్‌పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
పెమ్మసానిపై అంబటి సీరియస్ కామెంట్స్
-
పెమ్మసానికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
-
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు.