kvp private bill
-
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి
-
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి: సీఆర్
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుట్ర పన్ని కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును లోక్‌సభకు పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. తన ఇంట్లో శుభకార్యంలా చంద్రబాబు పుష్కరాలకు హడావుడి చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నా ఎవరూ అలా చేయడం లేదని అన్నారు. ఓవైపు దేవాలయాలు కూలగొట్టి మరోవైపు పుష్కరాల పేరుతో చంద్రబాబు షో చేస్తున్నారని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. -
ఏపీకి ఇవాళ బ్లాక్ డే: రఘువీరారెడ్డి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ బ్లాక్ డే అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభివర్ణించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ వచ్చి కేవీపీ రామచంద్రరావు ప్రైవేట్ బిల్లుపై కుట్ర పన్నారన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని రఘువీరా మండిపడ్డారు. ఓటింగ్ జరపాలని టీడీపీ ఎందుకు పట్టుబట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదానే కావాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేమన్నారు. కేవీపీ ప్రవేశపెట్టింది ద్రవబిల్లు అని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
కొంత అసంతృప్తి ఉంది.. అయినా...
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ... రెండేళ్లలో కొన్ని విషయాల్లో కేంద్రంపై కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయినా మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. బీజేపీ మిత్రధర్మం పాటిస్తుందో లేదో తెలపాలని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తుందని.. అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ బయటపెడతామన్నారు. ఆర్థిక, హోంశాఖలు సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరు అయ్యారు. -
రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దుమారం
-
రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు దుమారం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు మరోసారి రాజ్యసభలో దుమారాన్ని లేపింది. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ సోమవారం సభలో బిల్లు అంశాన్ని సభలో ప్రస్తావించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బిల్లు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. సభ్యుడి హక్కులను కాలరాసిందని ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. వచ్చే శుక్రవారం రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే బిల్లును వచ్చే శుక్రవారం చర్చించడం వీలుకాదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ బీజేపీ కావాలనే కేవీపీ ప్రైవేట్ బిల్లును అడ్డుకుంటోందన్నారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొన్నా జీరో అవర్ కొనసాగింది.