
ఏపీకి ఇవాళ బ్లాక్ డే: రఘువీరారెడ్డి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ బ్లాక్ డే అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభివర్ణించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ వచ్చి కేవీపీ రామచంద్రరావు ప్రైవేట్ బిల్లుపై కుట్ర పన్నారన్నారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని రఘువీరా మండిపడ్డారు. ఓటింగ్ జరపాలని టీడీపీ ఎందుకు పట్టుబట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదానే కావాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ పెట్టలేమన్నారు. కేవీపీ ప్రవేశపెట్టింది ద్రవబిల్లు అని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.