బడ్జెట్ రైలు బెజవాడలో ఆగేనా?
కొత్త రైల్వే జోన్ కోసం ఎదురుచూపులు
ప్రయాణికులకు సౌకర్యాల కల్పనపై ఆశలు
ప్రతిపాదనలపై ‘ప్రభు’ కరుణించేనా?
నేడు పార్లమెంట్‌కు రానున్న రైల్వే బడ్జెట్
రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ ఈసారైనా జిల్లాపై వరాల జల్లు కురిపించేనా.. అని జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
వాల్తేర్ డివిజన్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుంది. శాటిలైట్ స్టేషన్‌గా కొండపల్లి అభివృద్ధి, పుష్కరాల పనులకు నిధులు, విజయవాడ స్టేషన్‌లో సౌకర్యాల మెరుగుదల, స్పీడ్, అదనపు రైళ్ల మంజూరు వంటి అంశాలకు బడ్జెట్‌లో చోటు దక్కేనా అనేది వేచిచూడాలి.