నిప్పో స్థలం పరాధీనాన్ని అడ్డుకుంటా! | Mla Kotam Reddy Sridhar Reddy Fires On Minister Narayana | Sakshi
Sakshi News home page

నిప్పో స్థలం పరాధీనాన్ని అడ్డుకుంటా!

Published Fri, Apr 6 2018 12:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Mla Kotam Reddy Sridhar Reddy Fires On Minister Narayana - Sakshi

ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని అ త్యంత విలువైన నిప్పో స్థలాన్ని పరాధీనాన్ని అడ్డుకుని తీరుతానని నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తానని గతంలో చెప్పి మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ఆ స్థలంపై విచారణ చేస్తున్నామని ఎందుకు మాట మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆర్డీఓ, తహసీల్దార్‌ లిఖి త పూర్వకంగా ఇచ్చిన నిబంధనల ప్ర కారం నిప్పో ఫ్యాక్టరీని యజమానులు నడప లేకపోతే ఎటువంటి నష్ట పరి హారం చెల్లించకుండా ప్రభుత్వం స్వా« దీనం చేసుకోవచ్చుని స్పష్టంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇచ్చిన వా టిపై విచారణ జరపాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటని మంత్రిని ప్రశ్నిం చారు. ప్రధానంగా ఉత్తరాంధ ప్రాం తానికి చెందిన మం త్రికి నిప్పో స్థలా న్ని ధారాదత్తం చేయాలని జిల్లాకు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మంత్రి నా రాయణ, మేయర్‌ అజీజ్‌ నిప్పో స్థలా న్ని తక్షణమే స్వాధీనం చేసుకుని, ప్రజాప్రయోజనాలకు విని యోగించాలన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు, గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో మంత్రి, మేయర్‌ ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా తీర్మానం పెడితే అందరం సహకరిస్తామన్నారు.

కాగితాలు కాల్చేశామని చెప్పడం ఏమిటి?
నిప్పో స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సమాచార చట్టం ద్వారా కలెక్టర్‌ కార్యాలయానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేశానని, అయితే రెండు నెలల తర్వాత నిప్పో ఫ్యాక్టరీకి సంబంధించి అన్ని ఫైల్స్‌ను కాల్చేశామని (డీ డిస్పోజల్‌) అని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌ కార్యాలయం నుంచి తనకు ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నానని, ఆర్డీఓ  నుంచి 150 పేజీల వివరాలు పంపారన్నారు. అందులో 9,10 నిబంధనల్లో స్పష్టంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఉందన్నారు.  కలెక్టర్‌ కార్యాలయం కాల్చేశామని చెప్పడం,  ఆర్డీఓ కార్యాలయం అధి కా రులు పత్రాలు ఇవ్వడం చూస్తే కలెక్టరేట్‌ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

పోరాటాలతో సాధించాం
గతంలో రూ.కోట్ల విలువ చేసే కస్తూరిదేవి స్కూల్‌ స్థలాన్ని కొందరు కాజేయాలని చూస్తే పోరాటం చేసి అడ్డుకున్నానన్నారు. నెల్లూరురూరల్‌ పరిధి లోని జాతీయ రహదారి వద్ద టోల్‌ గేట్‌ ఏర్పాటు చేస్తామంటే పో రాటం చేసి అడ్డుకున్నామని గుర్తు చే శారు. అదే విధంగా ఇస్కాన్‌ సిటీ ప్రాంతంలో రూ.వంద కోట్ల విలువ చేసే పా ర్కు స్థలాన్ని కాజేయాని చూస్తే అడ్డుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. నిప్పో ఫ్యాక్టరీ స్థలం ప్రైవేటు పరం చేసే ఊరుకోమని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement