kotam reddy
-
కోటంరెడ్డికి విజయసాయి రెడ్డి మాస్ కౌంటర్..
-
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
పోలీస్‌స్టేషన్‌లో కోటంరెడ్డి రాద్ధాంతం
నెల్లూరు(క్రైమ్): అన్నదమ్ములపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని వెంటనే తనతో పంపాలని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం అర్ధరా త్రి నెల్లూరు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో రాద్ధాంతం చేశారు. పోలీసుల కథనం మేరకు.. గాంధీ గిరిజన కాలనీకి చెందిన దేవరకొండ వెంకట్, అతడి అన్న సుసేంద్ర, అదే ప్రాంతానికి చెందిన హరికృష్ణ మరికొందరు ప్రభుత్వ ఐటీఐ వద్ద ఆదివారం క్రికెట్ ఆడుతుండగా సుసేంద్ర, హరికృష్ణ మధ్య వివాదం జరిగింది. కొద్దిసేపటికి సద్దుమణగడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. హరికృష్ణ అదేరోజు సాయంత్రం సుసేంద్రకు ఫోన్ చేసి తిట్టాడు. కొద్దిసేపటి తర్వాత గొడవను సర్దుబాటు చేసుకుందామని సుసేంద్రకు ఫోన్ చేశాడు. దీంతో అతను తన సోదరుడు వెంకట్‌తో కలిసి ఐటీఐ కళాశాల వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ హరికృష్ణ, అతని బంధువులైన చంద్రమౌళి, స్నేహితుడు నవీన్, రవీంద్ర తదితరులున్నారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని వారు ఇనుపరాడ్లు, కర్రలతో వెంకట్, సుసేంద్రపై దాడి చేశారు. సుసేంద్ర కేకలు వేస్తూ పరుగులు తీయగా బ్రిడ్జి వద్ద నున్న కిశోర్, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి జరిగింది. ఇంతలో గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన వెంకట్, సుసేంద్రను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేరి్పంచారు. బాధితులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రాత్రి కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారు టీడీపీకి చెందిన వారు కావడంతో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెంటనే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేత అయిన నవీన్‌ను అక్రమంగా ఇరికించారని, వెంటనే తనతో పంపాలని లేకపోతే స్టేషన్లోనే పడుకుంటానని నానా రాద్ధాంతం చేశారు. స్థానిక పోలీస్ అధికారులతోపాటు నగర డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్ట్
-
కోటంరెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేయటంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ప్రశ్నించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కానీ ఓట్లు తొలగిస్తున్న వారిపై కాకుండా వారిని పట్టించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే కోటంరెడ్డి పోలీసులను దూషించారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఐదోనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు కోటంరెడ్డిని వైద్య పరీక్షలకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోటంరెడ్డి అరెస్ట్‌పై ఆయన కుటుంబంసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై భైఠాయించారు. -
నిప్పో స్థలం పరాధీనాన్ని అడ్డుకుంటా!
నెల్లూరు(సెంట్రల్): నగరంలోని అ త్యంత విలువైన నిప్పో స్థలాన్ని పరాధీనాన్ని అడ్డుకుని తీరుతానని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తానని గతంలో చెప్పి మున్సిపల్ మంత్రి పి.నారాయణ ఆ స్థలంపై విచారణ చేస్తున్నామని ఎందుకు మాట మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆర్డీఓ, తహసీల్దార్ లిఖి త పూర్వకంగా ఇచ్చిన నిబంధనల ప్ర కారం నిప్పో ఫ్యాక్టరీని యజమానులు నడప లేకపోతే ఎటువంటి నష్ట పరి హారం చెల్లించకుండా ప్రభుత్వం స్వా« దీనం చేసుకోవచ్చుని స్పష్టంగా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు అధికారికంగా ఇచ్చిన వా టిపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం ఏమిటని మంత్రిని ప్రశ్నిం చారు. ప్రధానంగా ఉత్తరాంధ ప్రాం తానికి చెందిన మం త్రికి నిప్పో స్థలా న్ని ధారాదత్తం చేయాలని జిల్లాకు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మంత్రి నా రాయణ, మేయర్ అజీజ్ నిప్పో స్థలా న్ని తక్షణమే స్వాధీనం చేసుకుని, ప్రజాప్రయోజనాలకు విని యోగించాలన్నారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు, గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్లో మంత్రి, మేయర్ ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా తీర్మానం పెడితే అందరం సహకరిస్తామన్నారు. కాగితాలు కాల్చేశామని చెప్పడం ఏమిటి? నిప్పో స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సమాచార చట్టం ద్వారా కలెక్టర్ కార్యాలయానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేశానని, అయితే రెండు నెలల తర్వాత నిప్పో ఫ్యాక్టరీకి సంబంధించి అన్ని ఫైల్స్‌ను కాల్చేశామని (డీ డిస్పోజల్) అని లిఖిత పూర్వకంగా కలెక్టర్ కార్యాలయం నుంచి తనకు ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నానని, ఆర్డీఓ నుంచి 150 పేజీల వివరాలు పంపారన్నారు. అందులో 9,10 నిబంధనల్లో స్పష్టంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయం కాల్చేశామని చెప్పడం, ఆర్డీఓ కార్యాలయం అధి కా రులు పత్రాలు ఇవ్వడం చూస్తే కలెక్టరేట్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పోరాటాలతో సాధించాం గతంలో రూ.కోట్ల విలువ చేసే కస్తూరిదేవి స్కూల్ స్థలాన్ని కొందరు కాజేయాలని చూస్తే పోరాటం చేసి అడ్డుకున్నానన్నారు. నెల్లూరురూరల్ పరిధి లోని జాతీయ రహదారి వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేస్తామంటే పో రాటం చేసి అడ్డుకున్నామని గుర్తు చే శారు. అదే విధంగా ఇస్కాన్ సిటీ ప్రాంతంలో రూ.వంద కోట్ల విలువ చేసే పా ర్కు స్థలాన్ని కాజేయాని చూస్తే అడ్డుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. నిప్పో ఫ్యాక్టరీ స్థలం ప్రైవేటు పరం చేసే ఊరుకోమని హెచ్చరించారు. -
గాంధీభవన్‌లో నేతల బాహాబాహీ
-
'ఇదేనా తిరుమల పవిత్రతను కాపాడ్డం?'