టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ
హిందూపురం అర్బన్: అనంతపురం జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ప్రశ్నప్రతం లీకేజీలో హిందూపురంలోని నారాయణ స్కూల్ సిబ్బంది హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవ హారంలో మడకశిరలో నలుగురిని అరెస్టు చేశారు.
ఇదే కేసులో ఎంజీఎం ప్రభుత్వ పాఠశాల ఉర్దూ టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు. చిలమత్తూరు ప్రైవేట్ ట్యూటర్ ఇలియాజ్ అహ్మద్ సెల్‌ఫోన్‌కు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో అందడం.. అతని నుంచి పలువురి సెల్‌ఫోన్లకు చేరిన విషయం తెల్సిందే. కాగా, నారాయణ పాఠశాల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సంబంధించింది కావడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో ‘నారాయణ’ సిబ్బంది
Published Mon, Mar 20 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement
Advertisement