పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ | Tenth hindi question paper leak in ananatapur district kadiri narayana school | Sakshi
Sakshi News home page

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్‌

Published Mon, Mar 20 2017 11:42 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

Tenth hindi question paper leak in ananatapur district kadiri narayana school

అనంతపురం : జిల్లాలో పదో తరగతి తెలుగు పేపర్‌ లీకేజీ వ్యవహారంపై మరవకముందే మళ్లీ పేపర్‌ లీక్‌ అయింది. కదిరి నారాయణ కాలేజీలో హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ అయిన ఘటన కలకలం రేపింది. కళాశాల సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ముందే పరిశీలించి ఆన‍్సర్‌ షీట్లను కూడా తయారు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హిందీ పరీక్షలో విద్యార్థలకు ఆ ఆన్సర్‌ షీట్లే పంపిణీ చేశారు.

సమాధానాలతో సహా బిట్‌ పేపర్లను విద్యార్థులకు అందించారు. ఇప్పటికే మడకశిరలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నలుగురు నారాయణ స్కూల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. . కాగా, నారాయణ పాఠశాల మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణకు సంబంధించింది కావడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement