లీకేజీలు చాలా చిన్నవిషయం: మంత్రి నారాయణ
అమరావతి: ఏపీ సచివాలయంలో తాజా లీకేజీలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు. లీకేజీలు చాలా చిన్న విషయమని.. భూతద్ధంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. స్లాబ్ పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయని మంత్రి తెలిపారు. మనం కట్టుకున్నఇళ్లలో కూడా మొదట్లో చాలా లోపాలుంటాయని.. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వర్షం తగ్గగానే మరమ్మత్తులు చేస్తామన్నారు. లోపాలను రెండేళ్లపాటు నిర్మాణ సంస్థలే సరిచేస్తాయని ఆయన తెలిపారు.
కాగా మంగళవారం సచివాలయంలో బయటపడ్డ లీక్ లపై మంత్రి నారాయణను మీడియా ప్రశ్నించింది. అయితే మొదట ఆ విషయం తనకు తెలియదని నారాయణ తోసిపుచ్చడం గమనార్హం.